Deepika Padukone: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!

దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 28 Mar 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనదైన శైలి యాక్టింగ్‌తో స్టార్‌గా ఎదిగారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమెకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హీరోయిన్‌ సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీపిక ప్రస్తుతం గర్భవతి. అందుకే విశ్రాంతి కోసం నటనకు కాస్త విరామం ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ వీటికి బలాన్నిచ్చింది. ‘మనం ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. ఒక్కోసారి విజయానికి నిర్వచనాన్ని మార్చాల్సి రావొచ్చు. మన తర్వాత వచ్చే తరానికి సైతం ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఉన్న కొటేషన్లను పంచుకున్నారు. దీంతో, ఆమె భవిష్యత్తు ప్రణాళికల గురించి వస్తోన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. తన జీవితంలో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించడం కోసం ఆమె విరామం తీసుకోనుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో  దీపిక పిల్లల  గురించి మాట్లాడుతూ..‘ఇంట్లో నన్ను ఎవరూ సెలబ్రిటీలా చూడరు. నేను నటి కంటే ముందు కుమార్తెను.. సోదరిని. అది మారాలని నేను కోరుకోవడం లేదు. నాకు కుటుంబం ముఖ్యం. రణ్‌వీర్‌కు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసమే మేమూ ఆతృతగా ఎదురుచూస్తున్నాం. చిన్నప్పట్నుంచీ మా అమ్మానాన్నలు నన్ను ఎంతో క్రమశిక్షణతో, వినయంతో పెంచారు. మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా సాధారణంగానే పెంచాలనుకుంటున్నాం. మంచి విలువల్ని నేర్పించాలనుకుంటున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం దీపిక ‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898AD) సినిమాలో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) హీరో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని