Devara: ‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్‌ మూవీ సాంగ్‌పై నిర్మాత ఆసక్తికర ట్వీట్‌

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 15 May 2024 22:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘దేవర’ (Devara) పాటపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ ‘జైలర్‌’లోని హిట్‌ సాంగ్‌ ‘హుకుం’ (Hukum)ని మించేలా దేవర గీతం ఉంటుందంటూ ట్వీట్‌ పెట్టారు. మే 19న దేవర ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ కానుందని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేసిన ఆయన.. ‘‘మీ అందరి కంటే ముందు నేను పాట విన్నా. నన్ను నమ్మండి. హుకుం పాటను మరిచిపోతారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందించిన ఈ మాస్‌ పాట మరో స్థాయిలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘దేవర ముంగిట నువ్వెంత..’ అంటూ ఫైర్‌ ఎమోజీ జోడించారు. దీన్ని బట్టి ఈ లైన్‌తోనే పాట ప్రారంభం కానుందని అర్థమవుతోంది.

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘దేవర’. ఓ తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ మూవీతోనే బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత ట్వీట్‌తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘జైలర్‌’ చిత్రానికీ అనిరుధే మ్యూజిక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని