Devara: Part 1: కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!

‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

Updated : 20 May 2024 09:40 IST

‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ పేరుతో అక్టోబరు 10న థియేటర్లలోకి రానుంది. సోమవారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘అగ్గంటుకుంది సంద్రం దేవా.. భగ్గున మండే ఆకశం దేవా..’’ అంటూ సినిమాలో దేవరగా ఎన్టీఆర్‌ వీరత్వాన్ని.. తన పాత్ర స్వభావాన్ని ఈ పాటలో వినిపించారు. ‘‘దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక.. రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట’’ అంటూ ఈ గీతంలో తారక్‌ పాత్రను రామజోగయ్య శాస్త్రి వర్ణించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు అందించడమే కాక తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్‌ వీడియోలో తారక్‌ను యాక్షన్‌ కోణంలో చూపించిన తీరు.. నడి సంద్రంలో ఆయన చేసిన సాహసాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సమర్పణ: కల్యాణ్‌ రామ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని