Devara: ‘దేవర’ తంగం

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ ‘దేవర’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ఇందులో తంగం అనే పాత్రలో కనిపిస్తుందని సినీ వర్గాలు అధికారికంగా తెలిపాయి.

Updated : 01 Nov 2023 14:42 IST

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ ‘దేవర’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ఇందులో తంగం అనే పాత్రలో కనిపిస్తుందని సినీ వర్గాలు అధికారికంగా తెలిపాయి. లంగా ఓణీతో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్న ఆమె లుక్‌ని కూడా మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రమిది. పాన్‌ ఇండియా స్థాయిలో... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రస్తుతం గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో తంగం అంటే బంగారం అని అర్థం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని