Dhanush: ధనుష్‌ 50వ చిత్రం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. టైటిల్‌ ఏంటంటే?

కోలీవుడ్‌ హీరో ధనుష్‌ 50వ సినిమా టైటిల్‌ ఖరారైంది. అదేంటంటే?

Published : 19 Feb 2024 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2002లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ధనుష్‌ (Dhanush) 50 చిత్రాలకు చేరుకున్నారు. 50వ సినిమా (Dhanush 50th Film) ఫస్ట్‌లుక్‌, పేరుని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ ల్యాండ్‌మార్క్‌ చిత్రానికి ‘రాయన్‌’ (Raayan) టైటిల్‌ పెట్టినట్లు తెలియజేస్తూ ఆనందం వ్యక్తంచేశారు. కొత్త లుక్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ చిత్ర కథను రాయడంతోపాటు దాన్ని తెరకెక్కించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. ఎ. ఆర్‌. రెహమాన్‌ (AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 2024లోనే విడుదల కానుంది. హీరోయిన్‌, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

దీంతోపాటు, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు సినిమాలో ధనుష్‌ నటిస్తున్నారు. ఇది ఆయనకు 51 సినిమా. ఇందులో ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna) కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక (Rashmika) కథానాయిక. సమాజంలోని అసమానతల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం.  టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. సంక్రాంతికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ధనుష్‌ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఈ హీరోకి దర్శకత్వం కొత్తేం కాదు. ఇంతకుముందు ‘పా.పాండి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రఘువరన్‌’ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని