Janhvi Kapoor: కాఫీ విత్‌ కరణ్‌.. జాన్వీకపూర్‌ వ్యాఖ్యలు వైరల్‌..!

నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ఆమె సోదరి ఖుషీకపూర్‌ (Kushi kapoor) ఓ సెలబ్రిటీ చాట్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

Published : 01 Jan 2024 17:13 IST

ముంబయి: బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan). తాజాగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులోని ఓ సెగ్మెంట్‌లో ‘నీ స్పీడ్‌ డయల్‌ లిస్ట్‌ లో ఉన్న ముగ్గురు పేర్లు చెప్పు?’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘‘పప్పా (బోనీ కపూర్‌), ఖుషూ (ఖుషీ కపూర్‌), షికూ’’ అంటూ ఆమె నవ్వులు పూయించారు. ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె మాట్లాడుతుంది శిఖర్‌ పహారియా గురించేనని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

Rakul Preet Singh: రకుల్‌ వివాహం.. నెట్టింట వైరల్‌గా వెడ్డింగ్‌ డేట్‌..?

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడే శిఖర్‌ పహారియా (Shikhar Pahariya). అతడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) - శిఖర్‌ ఎంతో కాలం నుంచి స్నేహితులు. బీటౌన్‌లో జరిగే చాలా పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో.. ప్రేమలో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ తిరుపతి, ఉజ్జయిని దేవాలయాలను సందర్శించడం ఆయా కథనాలకు బలం చేకూర్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని