Rakul Preet Singh: రకుల్‌ వివాహం.. నెట్టింట వైరల్‌గా వెడ్డింగ్‌ డేట్‌..?

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వెడ్డింగ్‌ డేట్‌కు సంబంధించిన కథనాలు వైరల్‌గా మారాయి.

Updated : 01 Jan 2024 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటామని గతంలో రకుల్‌ స్పష్టతనిచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని ఆయా వార్తల్లోని సారాంశం. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రివ్యూ: సర్కారు నౌకరి.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది?

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన ‘అయాలన్‌’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో ఆమె ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని