Buchi Babu: విషాదంలో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు

టాలీవుడ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది.

Published : 31 May 2024 19:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకటరావు (68) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా)లో వెంకటరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌.. వెంకటరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. కష్ట సమయంలో బుచ్చిబాబుకు అండగా నిలిచారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సినీ ప్రముఖులు బుచ్చిబాబు కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

సుకుమార్‌ (Sukumar), బుచ్చిబాబు గురు- శిష్యులనే సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’తో డైరెక్టర్‌గా మారిన బుచ్చిబాబు తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని