‘కల్కి’పై హాలీవుడ్‌ డైరెక్టర్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’పై హాలీవుడ్‌ దర్శకుడు కామెంట్స్‌ చేశారు.

Published : 09 Apr 2024 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ తమ్ముడు జోనాథన్‌ నోలన్‌ కామెంట్‌ చేశారు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన జోనాథన్‌.. ‘కల్కి’ గురించి, ఇండియన్‌ సినిమాలపై చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

‘‘భారతీయ చిత్రాల్లో లొకేషన్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే స్టంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. నాకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలను తెరకెక్కించడం ఇష్టం. అవి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తాయి. ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్‌ సలహా తీసుకునే స్థాయిలో లేరు. వాళ్లు ఏం చేస్తున్నారో వారికి బాగా తెలుసు. అన్నీ ప్రాక్టికల్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం భారత దర్శక, నిర్మాతలు హాలీవుడ్‌ వారి కంటే గొప్పగా పని చేస్తున్నారు. ప్రతీ సన్నివేశాన్ని క్లియర్‌గా చూపుతున్నారు’’ అంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

6,000 సంవత్సరాల మధ్య జరిగే కథగా ‘కల్కి’ రూపొందుతోంది. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించినట్లు ఇటీవల నాగ్‌ అశ్విన్ ఓ సందర్భంలో చెప్పారు. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల మే 30కు వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని