Raja Saab: ‘రాజా సాబ్‌’ స్టోరీలైన్‌ పోస్ట్‌ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌.. దర్శకుడు మారుతి రియాక్షనిదే..

‘రాజా సాబ్‌’ స్టోరీ లైన్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ పోస్ట్‌ చేసింది. దీనిపై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించారు.

Updated : 17 Jan 2024 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతి (maruthi) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’ (Raja Saab). సంక్రాంతి కానుకగా దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సందడి చేసింది. తాజాగా ఈ సినిమా విషయంలో మారుతి పెట్టిన పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ‘ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌’ (ఐఎమ్‌డీబీ) (IMDb) ఈ చిత్రం స్టోరీలైన్‌ను వాళ్ల వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీనిపై మారుతి ఫన్నీగా స్పందించారు.

ప్రేమలో పడిన జంటకు దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలు.. విధిని ఎదిరించి వారు పోరాడటం వంటి అంశాలతో ‘రాజా సాబ్‌’ తెరకెక్కనుందని ‘ఐఎమ్‌డీబీ’ పేర్కొంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన మారుతి.. ‘‘అరెరే నాకు ఈ స్టోరీలైన్‌ గురించి తెలియక మరో స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నా స్క్రిప్ట్‌ను అంగీకరిస్తుందో లేదో’’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘మీ సినిమాలే కాదు.. మీ మాటలు కూడా నవ్వు తెప్పిస్తాయి’ అని అంటున్నారు.

‘హనుమాన్‌’పై స్టార్‌ నటుల ప్రశంసలు..

‘రాజా సాబ్‌’ విషయానికొస్తే.. ఎలాంటి ప్రచారం లేకుండా దీన్ని గతేడాది ప్రారంభించారు. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం దీనితో పాటు ‘కల్కి 2898 ఏడీ’ (Kaliki 2898 AD)లో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని