Hanuman: ‘హనుమాన్‌’పై స్టార్‌ నటుల ప్రశంసలు..

‘హనుమాన్‌’పై స్టార్‌ నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated : 17 Jan 2024 12:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ‘హనుమాన్‌’పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ అగ్ర నటులు ఈ చిత్రబృందాన్ని అభినందించగా.. ఇప్పుడు కన్నడ స్టార్‌ హీరోలు అద్భుతమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని శివరాజ్‌ కుమార్‌, రిషబ్‌ శెట్టి వీక్షించారు. సమంత (Samantha) తన ఇన్‌స్టాలో ‘హనుమాన్‌’ వసూళ్లపై పోస్ట్‌ పెట్టారు.

‘‘ఈ చిత్రంలో తేజ సజ్జ బాగా నటించాడు. ఎంతో కష్టమైన సన్నివేశాలను కూడా సులువుగా చేశాడు. దర్శకుడి విజన్‌ మరోస్థాయిలో ఉంది. నటీనటులందరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అద్భుతం. చివరి 30 నిమిషాలు నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. 2025లో రానున్న ‘జై హనుమాన్‌’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.

‘మీర్జాపూర్‌ 3’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

‘‘హనుమాన్’ను ప్రశంసించేందుకు అందరితో పాటు నేనూ సిద్ధమయ్యాను. ప్రశాంత్‌ వర్మ కథను తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు ఈ స్థాయి విజయాన్ని అందించాయి. తేజ సజ్జ ఆకట్టుకున్నాడు’ అని ఎక్స్‌లో రిషబ్‌ శెట్టి అభినందించారు. ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించడంపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. పోస్టర్‌ను షేర్‌ చేసి ‘మీరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలకృష్ణ తాజాగా వీక్షించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారత్‌లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ అదరగొడుతోంది. స్టార్‌ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని