Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్‌’ రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ క్లారిటీ

తన తాజా చిత్రం ‘సలార్‌’పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

Published : 29 Nov 2023 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) ఒకే యూనివర్స్‌లో తెరకెక్కాయనే రూమర్స్‌పై ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ‘సలార్‌’కు మరే సినిమాతో సంబంధం ఉండదని, అదొక విభిన్న కథ అని తెలిపారు. ‘‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. అందులోని హీరో పాత్ర, ఇతర పాత్రలకు బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే వారు మళ్లీ అలాంటి ఎమోషన్‌ కోరుకుంటున్నారు. ‘కేజీయఫ్‌’తో ‘సలార్‌’కు లింక్‌ లేదు. రెండింటికీ కనెక్షన్‌ ఉందనుకున్న వారిని నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు’’ అని పేర్కొన్నారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడమే ‘సలార్‌’ కథాంశమని తెలిపారు. ఆ స్టోరీని ‘కేజీయఫ్‌’కు ముందే రాసుకున్నానని చెప్పారు.

అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్‌ శెట్టి

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాటి తర్వాత ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం కావడం, ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించడంతో ‘సలార్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ‘సలార్‌’.. పార్ట్‌ -1 డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను డిసెంబరు 1న విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని