Bubblegum: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కే అలా ఉంటే.. ఇక్కడ ఎన్నో ‘ఆర్‌’లు: రాఘవేంద్ర రావు

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ‘బబుల్‌గమ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలిలో మాట్లాడి అలరించారు.

Updated : 15 Dec 2023 21:02 IST

హైదరాబాద్‌: చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో, ఆయా చిత్ర బృందాలకు సపోర్ట్‌ ఇవ్వడంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన ‘బబుల్‌గమ్’ (Bubblegum) ట్రైలర్‌ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలి ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. వేడుకనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘RRR’.. అంటేనే ఘన విజయం అందుకుందా సినిమా. మరి, ఈ వేదికపై రవికాంత్‌, రానా, రోషన్‌, రాఘవేంద్రరావు, రాజీవ్‌, రావిపూడి.. ఇలా ఎన్నో ‘R’లు ఉన్నాయి. అప్పుడే సుమ ముఖం వెలిగిపోతోంది. ఆమెది మాస్టర్‌ ప్లాన్‌. బబుల్‌గమ్‌ మెల్లగా ఉబ్బుతూ చివరకు పేలిపోతుంది. అలాగే ఈ సినిమా విషయంలోనూ టాక్‌ మెల్లగా మొదలై సూపర్‌హిట్ అవుతుంది. ట్రైలర్‌ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌.. ఐసిస్‌ చెర నుంచి యువతిని ఎలా కాపాడారు?

రవికాంత్‌ కథలు, చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటాయని, వాస్తవానికి దగ్గరగా ఉంటాయని మరో అతిథి హీరో రానా పేర్కొన్నారు. నటన పరంగా రోషన్‌పై పేరెంట్స్‌ ప్రభావం లేదనిపిస్తోందని, పూర్తిగా తనదైన శైలిలో నటించాడని దర్శకుడు అనిల్‌ రావిపూడి కొనియాడారు. రాజీవ్‌ కనకాల (Rajeev Kanakala)- సుమ (Suma) దంపతుల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) హీరోగా నటించిన చిత్రమే ‘బబుల్‌గమ్‌’. ఈ సినిమాతో అతడు తెరంగేట్రం చేస్తున్నాడు. మానస చౌదరి కథానాయికగా (manasa chowdary) పరిచయమవుతోంది. ‘క్షణం’ ఫేమ్‌ రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని