NTR: ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా!.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల

తన తర్వాత ప్రాజెక్ట్‌పై వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) స్పందించారు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపారు.

Published : 27 Nov 2023 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సినిమా ‘దసరా’తోనే సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల. నాని (Nani)హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుని ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల చేయనున్న ప్రాజెక్ట్‌పై కొన్ని రోజుల నుంచి రూమర్స్‌ మొదలయ్యాయి. వీటిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తన తర్వాత సినిమా ఎవరితో చేయనున్నారో చెప్పారు.

ప్రభాస్‌, ఎన్టీఆర్‌(NTR)ల కోసం శ్రీకాంత్ ఓదెల ఓ భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఒక స్క్రిప్ట్‌ రాస్తున్నాను. అది నానితోనే ఉంటుంది. యాక్షన్‌ సినిమా. నేను ఎన్టీఆర్, ప్రభాస్‌ల కోసం కథ రాస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్‌ ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు’ అని అన్నారు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్‌ పడినట్లైంది. అలాగే ‘దసరా’ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానున్నట్లు స్పష్టమైంది.

ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం.. విజేతలు ఎవరంటే..?

ప్రస్తుతం నాని ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ-కూతురు మధ్య అనుబంధంతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్, పాటలు దీనిపై అంచనాలు పెంచేశాయి. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ‘సరిపోదా శనివారం’ అనే యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీకాంత్‌ ఓదెల సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని