Ram pothineni: ఇస్మార్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చిన హిట్‌ కాంబో..

రామ్‌ పోతినేని (Ram pothineni), దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేశారు.

Published : 10 Jul 2023 11:56 IST

హైదరాబాద్‌: పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Ram pothineni) నటించిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar). మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా సీక్వెల్‌ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది.

నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు తెలుపుతూ దానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ఇక  ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జులై 12 నుంచి మొదలుకానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు  ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన రామ్‌ పోతినేని ‘ఈ సారి వినోదం, యాక్షన్‌ అన్నీ డబుల్‌. మీ అందరికి డబుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఇవ్వడానికి మేం తిరిగి వచ్చేశాం’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని