Ravi Teja: ‘ధమాకా’ విషయంలో నేననుకున్నది నిజమైంది: రవితేజ

‘ధమాకా’ సినిమా విషయంలో తాను అనుకున్నది నిజమైందని హీరో రవితేజ అన్నారు. అదేంటంటే?

Published : 25 Dec 2023 22:53 IST

హైదరాబాద్‌: రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sree Leela) జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై ఏడాది గడిచింది. మరోవైపు, రవితేజ తాజా సినిమా ‘ఈగల్‌’ (Eagle) 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ (Eagle X Dhamaka Celebrations Event) పేరుతో సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ‘ధమాకా’ టీమ్‌కు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ జ్ఞాపికలు అందజేశారు.

ఆ ఒక్క కారణంతో.. తొలివారం సుమారు రూ.40 కోట్లు నష్టపోయాం: ‘యానిమల్‌’ నిర్మాత

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘‘ధమాకా’ నిన్నో మొన్నో విడుదలైనట్లుంది. సంవత్సరం అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. సంగీత దర్శకుడు భీమ్స్‌కు మంచి గుర్తింపు వస్తుందని ధమాకా సినిమా విడుదలకాక ముందు అనుకున్నా. అదే నిజమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మళ్లీ మేం కలిసి పనిచేయబోతున్నాం. ఊహించినట్లే శ్రీలీల హీరోయిన్‌గా రాణిస్తోంది’’ అని అన్నారు. ‘ఈగల్‌’ గురించి చెబుతూ.. ‘‘దర్శకుడు కార్తీక్‌ మీకు కొత్త రవితేజను చూపించబోతున్నాడు. ఈ సినిమాలో కొత్త కావ్యా థాపర్‌ కనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘పెళ్లిసందD’ విడుదలకు ముందే నాకు ‘ధమాకా’లో నటించే అవకాశం వచ్చింది. మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని శ్రీలీల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావ్యా థాపర్‌, అవసరాల శ్రీనివాస్‌, భీమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని