Eagle: రవితేజ ‘ఈగల్‌’.. ఆ రూమర్స్‌ ఖండించిన టీమ్‌

రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్‌’. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై టీమ్‌ స్పందించింది.

Published : 01 Nov 2023 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2024 సంక్రాంతి బరిలో నిలవనున్న చిత్రాల్లో ‘ఈగల్‌’ (Eagle) ఒకటి. రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే, పలు కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడనుందని, జనవరి 26న విడుదలయ్యే అవకాశాలున్నాయని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. వీటిపై ‘ఈగల్‌’ టీమ్‌ స్పందించింది. అవన్నీ రూమర్స్‌ అంటూ వాటిని ఖండించింది. ముందుగా అనుకున్న తేదీకే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఈగల్‌’తోపాటు మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ (Saindhav), విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star), నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Saami Ranga), తేజ సజ్జ ‘హనుమాన్‌’ (Hanuman) తదితర చిత్రాలు పోటీ పడనున్న సంగతి తెలిసిందే.

మరోసారి వాయిదాపడ్డ ‘ఆదికేశవ’.. కారణమిదే!

యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ‘ఈగల్‌’లో రవితేజ పలు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటిస్తున్నారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి. జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని