Adikeshava: మరోసారి వాయిదాపడ్డ ‘ఆదికేశవ’.. కారణమిదే!

 వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆదికేశవ’ (Adikeshava). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.

Published : 01 Nov 2023 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej)- శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆదికేశవ’ (Adikeshava). ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. వరల్డ్ కప్‌ కారణంగా దీని రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలిపిన ఆయన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్‌ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

మొదట ఈ సినిమాను ఆగస్టు 18న విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల నవంబర్‌ 10కి వాయిదా పడింది. అయితే, 15, 16 తేదీల్లో వరల్డ్ కప్‌ సైమీఫైనల్స్‌ ఉన్న కారణంగా నవంబర్24కు వాయిదా వేశారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల నేను నిర్మించిన ‘మ్యాడ్‌’, ‘లియో’ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటి కలెక్షన్లపై క్రికెట్‌ మ్యాచ్‌ ప్రభావం పడింది. ‘ఆదికేశవ’ విడుదల సమయంలోనూ మ్యాచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా నవంబర్‌10న మరో నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. అందుకే ‘ఆదికేశవ’ను నవంబర్‌ 24న విడుదల చేయాలని నిర్ణయించాం’’ అన్నారు.

‘యానిమల్‌’ రన్‌టైమ్‌పై ఆసక్తికర చర్చ!

శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఓ గుడి చుట్టూ సాగే కథతో రూపొందింది. వైష్ణవ్‌తేజ్‌.. రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల సందడి చేయనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రబృందం ఇటీవల ఇందులోని పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. అందులో శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌లు డ్యాన్స్‌లతో ఆదరగొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని