Eagle: ‘ఈగల్‌’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

‘ఈగల్‌’ (Eagle) కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. సంక్రాంతి రేసు నుంచి వైదొలగడం గురించి ఆసక్తికర ట్వీట్‌ చేసింది.   

Published : 05 Jan 2024 14:41 IST

హైదరాబాద్‌: రవితేజ (Raviteja) నటించిన తాజా చిత్రం ‘ఈగల్‌’ (Eagle). కార్తిక్‌ ఘట్టమనేని దర్శకుడు. సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఈగల్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం శుక్రవారం ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్‌’ను ఫిబ్రవరికి తీసుకొచ్చాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్‌ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాం. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్‌ కాదు’’ అని ట్వీట్‌ చేసింది. ఫిబ్రవరి 9న ‘ఈగల్‌’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Suriya: విజయకాంత్‌ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య

‘టైగర్‌ నాగేశ్వరరావు’ తర్వాత రవితేజ నుంచి వస్తోన్న చిత్రమిది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఈగల్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్‌ భావించింది. దాదాపు ఐదు చిత్రాలు పండుగ రేసులో ఉండటంతో అన్నింటికీ థియేటర్స్‌ దొరకడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐదు చిత్రాల నిర్మాతలతో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ చర్చలు జరిపాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ మేరకు ‘ఈగల్‌’ నిర్మాత తమ సినిమాని వాయిదా వేసేందుకు అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని