Suriya: విజయకాంత్‌ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య

విజయకాంత్‌కు నివాళులర్పించారు నటుడు సూర్య (Suriya). ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

Updated : 05 Jan 2024 13:53 IST

చెన్నై: కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (vijayakanth)కు నటుడు సూర్య (Suriya) నివాళులర్పించారు. షూటింగ్‌ కారణంగా విదేశాల్లో ఉండటంతో విజయకాంత్‌కు తుది నివాళి అర్పించేందుకు సూర్య రాలేకపోయారు. గురువారం చెన్నైకు చేరుకున్న ఆయన.. విజయకాంత్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. ‘కెప్టెన్‌’ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

శివాజీ నటించిన ‘#90s’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే..!

‘‘విజయకాంత్‌ నాకు పెద్దన్నతో సమానం. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కెరీర్‌ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ‘పెరియన్నా’ కోసం తొలిసారి విజయకాంత్‌తో కలిసి వర్క్‌ చేశా. సెట్‌లో ఆయనతో కలిసి భోజనం చేశా. డ్యాన్స్‌, ఫైట్‌ బాగా చేయాలంటూ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన నాలో స్ఫూర్తినింపారు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని సూర్య పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని