Amigos: ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. రాదీ వెన్నెలమ్మ

కల్యాణ్‌ రామ్‌ (Kalyan ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 01 Feb 2023 06:45 IST

ల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ (Balakrishna) హిట్‌ గీతాల్లో ఒకటైన ‘‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదీ వెన్నెలమ్మ’’ పాటను రీమిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి సాహిత్యంతో రూపొందిన ఈ పాటను అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా.. రీమిక్స్‌ గీతాన్ని ఆయన తనయుడు ఎస్పీబీ చరణ్‌, గాయని సమీర భరద్వాజ్‌ ఆలపించారు. లిరికల్‌ వీడియోలో కల్యాణ్‌రామ్‌, ఆషికా రంగనాథ్‌ల మధ్య సాగే కెమిస్ట్రీని చూడముచ్చటగా చూపించారు. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఆసక్తికర కథతో రూపొందిన చిత్రమిది. జిబ్రాన్‌ స్వరాలందించారు. సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని