Farah Khan: నాలుగు క్యారవాన్‌లు ఇస్తే కానీ సెట్‌లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్‌ తారలను ఉద్దేశించి బాలీవుడ్‌ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 20 Apr 2024 17:54 IST

ముంబయి: బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ సెలబ్రిటీలను ఉద్దేశించి ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరాఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సెట్‌లో బీటౌన్‌ తారలు ఎలా ప్రవర్తిస్తారో చెప్పారు. సినిమా చిత్రీకరణ సమయంలో పలువురు తారలు హై డిమాండ్స్‌ చేస్తారని.. వాటిని నెరవేరిస్తేనే షూట్‌లోకి అడుగు పెడతారన్నారు.

‘‘సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నటీనటులకు సెట్స్‌లోనే అన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో హీరోయిన్లు చెట్లు లేదా వ్యాన్ల వెనక నిల్చొని దుస్తులు మార్చుకునేవారు.  కానీ, ఇప్పుడు అలా కాదు. నటీనటులు తమ వానిటీ వ్యాన్స్‌ వస్తే కానీ సెట్‌లోకి అడుగుపెట్టడం లేదు. ఒక్కొక్కరూ దాదాపు నాలుగు క్యారవాన్‌లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకదానిలో జిమ్‌, కిచెన్‌ కోసం ఒకటి, స్టాఫ్‌ కోసం మరొకటి ఇలా ఉపయోగిస్తున్నారు’’ అని ఫరాఖాన్‌ తెలిపారు.  వీటివల్ల నిర్మాతలపై ఎంతో భారం పడుతుందన్నారు.  క్యారవాన్‌ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’, ‘తీన్‌ మార్‌ ఖాన్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రాలకు ఫరా దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని