Gaami: ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..

‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

Updated : 16 Apr 2024 13:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చాందినీ చౌదరి కథానాయిక. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్‌ అఘోరాగా కనిపించి ఆకట్టుకున్నారు. థియేటర్లో మంచి ఆదరణ లభించగా.. ఓటీటీలోనూ రికార్డు నెలకొల్పింది. జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వీక్షణలను సొంతం చేసుకుంది. 50 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ నమోదు చేసినట్లు సంస్థ పేర్కొంది. 72 గంటల్లోపే ఈ స్థాయి ఆదరణ రావడం సరికొత్త రికార్డని తెలిపింది. దీనిపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది.

‘గామి’ కథేంటంటే: శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. అనే విషయాలేం గుర్తుండవు. పైగా మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతడిని శాపగ్రస్థుడుగా భావించి ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు శంకర్‌. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడిని ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికర విశేషాలతో ‘గామి’ తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని