Vishwak Sen: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన

విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ సినిమా వాయిదా పడింది.

Published : 28 Nov 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందుతోన్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (gangs of godavari) సినిమా విడుదల తేదీ మారింది. ఈ సినిమాని వాయిదా (gangs of godavari postponed) వేసినట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నేపథ్యంలో యాక్షన్‌, వినోదం నిండిన కథతో కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నేహాశెట్టి కథానాయిక. ముందుగా ఈ సినిమాని డిసెంబరు 8న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది.

ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా!.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల

అదే సమయంలో నాని ‘హాయ్‌ నాన్న’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ తదితర చిత్రాలు వస్తుండడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అదే సమయంలో విశ్వక్‌ పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెబుతున్నా.. డిసెంబర్‌ 8న వస్తున్నాం. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్‌ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’’ అని విశ్వక్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పోస్ట్ పోన్ చేద్దామని నేను అంటానేమోనని విశ్వక్‌ భావించి ఉంటాడు. అనుకున్న తేదీ కాకుండా సినిమా విడుదల వాయిదా వేస్తే ఏ హీరో అయినా ఎంతగానో బాధపడతారు. అందుకే, విశ్వక్‌ అలా పోస్ట్‌ పెట్టాడనుకుంటా. అనుకున్న తేదీకే రిలీజ్‌ చేయాలా? లేదా వాయిదా వేయాలా? అనేది మేమింకా ఆలోచించలేదు. షూటింగ్‌ జరుగుతోంది. సినిమా చూసి.. మేకింగ్‌ పట్ల నేనూ-విశ్వక్‌ కాన్ఫిడెంట్‌గా ఉంటే డిసెంబర్‌ 8నే రిలీజ్‌ చేస్తాం’’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు