Gautham Vasudev Menon: సినిమా వాయిదా.. గౌతమ్‌ మేనన్ ఎమోషనల్‌ పోస్ట్

గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Published : 29 Nov 2023 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ మేనన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. నవంబర్‌ 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం తాజాగా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఎంతో తపనతో ‘ధృవ నక్షత్రం’ సినిమాను ప్రారంభించాం. ఈ మధ్యలో పనుల విషయంలో ఎంతో ప్రతికూలత ఎదురైంది. అయినా అంకితభావంతో సినిమాను పూర్తి చేశాం. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం. నవంబర్‌ 24న విడుదల చేయాలని ఎంతో ప్రయత్నించాం. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించడంలో విఫలమయ్యాం. ఎంతో నిరాశపడ్డాం. ‘ధృవ నక్షత్రం’ను మీ ముందుకు తీసుకురావడానికి మేము శక్తికి మించి శ్రమిస్తున్నాం. మీ అందరి ప్రేమ, మద్దతు మాకు అపారమైన భరోసానిస్తున్నాయి. మాకు నమ్మకాన్నిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని గౌతమ్‌ మేనన్ (Gautham Vasudev Menon)పేర్కొన్నారు.

సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్‌

2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఆర్థిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ నెల 24న రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవ్వగా.. మద్రాసు హైకోర్టు కొన్ని కారణాల వల్ల దీని విడుదలను ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని