Vishal: సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్‌

సీబీఎఫ్‌సీ కేసు విచారణలో భాగంగా హీరో విశాల్‌ (Vishal) సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన జీవితంలో సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని ఊహించలేదంటూ పోస్ట్‌ పెట్టారు.

Updated : 29 Nov 2023 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification)పై విశాల్ ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఎఫ్‌సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.

సీబీఎఫ్‌సీ కేసు విచారణలో భాగంగా ముంబయిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లినట్లు విశాల్‌ తెలిపారు. ‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే దానిపై కూడా వాళ్లు కొన్ని సూచనలు తీసుకున్నారు. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది’ అని విశాల్ రాసుకొచ్చారు.

అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్‌ శెట్టి

అసలేం జరిగిందంటే.. తాను నటించిన ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్‌ ఇటీవల ఆరోపించారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను విశాల్ కోరారు. ఆయన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సీబీఐను రంగంలోకి దించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని