ప్రపంచం చూడని కొత్త క్రైమ్‌!

ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ తన తనయుడు చైతన్యకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ.. బసవతారక రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ‘బ్రీత్‌’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు.

Updated : 14 Nov 2023 14:31 IST

న్టీఆర్‌ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ తన తనయుడు చైతన్యకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ.. బసవతారక రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ‘బ్రీత్‌’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. వైదిక సెంజలియా కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం.. మరోవైపు హీరో పేషెంట్‌లా అదే ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు.. ఇలా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘‘ఇప్పటి వరకు ప్రపంచం చూడని ఓ కొత్త క్రైమ్‌ జరుగుతోంది’’ అంటూ ప్రచార చిత్రంలో వినిపించిన ఓ డైలాగ్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాని సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు చేస్తున్నట్లు అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని