Ananya Panday: బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు

చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్య పాండే.

Updated : 19 Apr 2024 11:43 IST

చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్య పాండే. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో చిత్రసీ మలోకి అడుగుపెట్టిన ఈమె, తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ‘లైగర్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య సినీరంగంలోని కథానాయికల మధ్య ఉండే స్నేహం, ఆ విషయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ గురించి మాట్లాడింది. ‘కలిసి పనిచేస్తున్నప్పుడు స్నేహితులను చేసుకోకూడదని ఏ ఒక్క నటి అనుకోదు. ఈ పరిశ్రమలోని హీరోయిన్లు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నాకు మంచి స్నేహితులున్నారు. బయటి వాళ్లు మా మధ్య సాంగత్యాన్ని ఎప్పటికీ చూడలేరని నా అభిప్రాయం. అంత మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టే నాకు అతి తక్కువ సమయంలోనే దీపికా పదుకొణె, భూమి పెడ్నేకర్‌ లాంటి నాయికలతో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయంలో నన్నెంతో మంది ట్రోల్స్‌ చేశారు. నన్నెప్పుడూ అవి ప్రభావితం చేయలేదు’ అని చెప్పింది.  ప్రస్తుతం ‘కంట్రోల్‌’, ‘శంకర’ చిత్రాలతో బిజీగా ఉంది అనన్య.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని