ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్‌ దో ప్యార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది.

Published : 25 Apr 2024 01:04 IST

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్‌ దో ప్యార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. సినిమా ప్రచారంలో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత, వృత్తిగత విషయాలు ఇలా పంచుకుంది.

సినిమాల ఎంపికలో నేను ఆచితూచి వ్యవహరిస్తుంటా. అందుకే తరచూ విరామం వస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం అలా కాదు. మంచి పాత్రల కోసం చూస్తున్న సమయంలోనే 2020లో కరోనా విరుచుకుపడింది. ‘దో ఔర్‌ దో ప్యార్‌’తో 2021లోనే చిత్రీకరణ మొదలైంది. ఈలోగా నేను గర్భం దాల్చడం.. బాబుకు జన్మనివ్వడంతో మరింత గ్యాప్‌ వచ్చింది. కొన్నిసార్లు.. మన చేతుల్లో ఏమీ లేకుండానే విరామం తీసుకోవాల్సి వస్తుంటుంది.

  • ఈ సినిమాలోని నోరా పాత్రకు, నా వ్యక్తిత్వానికి దగ్గరి పోలికలుంటాయి. నోరాలాగే నేనూ చాలా సున్నిత మనస్కురాలిని. నాకంటూ గాఢంగా ప్రేమించే ఓ వ్యక్తి ఉండాలని బలంగా కోరుకుంటాను. నచ్చినవాళ్లని హత్తుకోవడం, మనస్ఫూర్తిగా ప్రేమించడం, వాళ్లని బాగా నమ్మడం చేస్తుంటా. జనం ముందు సైతం ఇవన్నీ చేయడానికి వెనకాడను. నోరా కూడా అలాంటిదే. తన సొంతం అనుకున్న వ్యక్తి రోజంతా అతడితోనే ఉండాలనుకుంటుంది. అతడి చేయి వదలదు.
  • కొంతమంది ఎప్పుడూ ఎదుటివాళ్లను జడ్జ్‌ చేయాలని చూస్తుంటారు. ఫలానావాళ్లు ఫలానా రకం అని వాళ్లకు వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అలాంటివి విని, నవ్వుకోవడం తప్ప చేసేదేం ఉండదు. ‘దో ఔర్‌ దో ప్యార్‌’ అవకాశం నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నా. స్క్రిప్టు నాకు అంత బాగా నచ్చింది. నెగెటివ్‌ కోణమున్న పాత్ర కావడంతో దర్శకురాలు శిరీషా సైతం బహుశా నేను అంత తొందరగా ఒప్పుకుంటానని అనుకోలేదేమో!
  • ఈ పాత్ర ఎలాంటి కసరత్తులు చేయలేదు. శారీరకంగా ఏమీ మార్చుకోలేదు. ఆ సమయంలో పాత్ర కోసం నన్ను నేను మార్చుకునే ఓపిక కూడా లేదు. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. ‘నేనిప్పుడు ఫిట్‌గా లేను. మానసికంగా చాలా అలసిపోయాను. బరువు తగ్గడం నావల్ల కాదు’ అని శిరీషతో చెప్పేశాను. అప్పుడు తను ‘స్టుపిడ్‌లా మాట్లాడకు. నువ్వు ఎలా ఉంటే అలాగే కంటిన్యూ అవ్వు’ అని భరోసా ఇచ్చింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని