గ్రామీణ ప్రేమకథ

పృథ్వీ కథానాయకుడిగా పాలిక్‌ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్‌, రావుల రమేశ్‌, టి.ఎస్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 25 Apr 2024 01:07 IST

పృథ్వీ కథానాయకుడిగా పాలిక్‌ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్‌, రావుల రమేశ్‌, టి.ఎస్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు దశరథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వీరశంకర్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా ఇది నా మూడో చిత్రం. ‘స్వాతిముత్యం’ తరహాలో ఓ మంచి కుటుంబ కథా చిత్రం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే, ఈ సినిమాని మొదలుపెట్టాం. వచ్చే నెల 25 నుంచి సెట్స్‌పైకి తీసుకెళుతున్నాం. దీపావళికి విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుంది. నేనొక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నా’’ అన్నారు ఆమని.  అజయ్‌ ఘోష్‌, జీవా, షకలక శంకర్‌, సుమన్‌ తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని