జులైలో భారతీయుడు 2

కథానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు శంకర్‌ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది.

Published : 20 May 2024 01:43 IST

థానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు శంకర్‌ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జైంట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాజల్‌ కథానాయిక. సిద్ధార్థ్, ఎస్‌.జె.సూర్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఈనెల 22న జూన్‌ 1న చెన్నైలో ఈ చిత్ర పాటల వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశాన్ని క్యాన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సేనాపతి ఏం చేశాడన్నది? ఈ చిత్ర ఇతివృతం. సంగీతం: అనిరుధ్, ఛాయాగ్రహణం: రవివర్మన్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు