పోలీసు హెచ్చరిక

ఏ రోజు నేను వాడిని కలుస్తానో... అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించింది ఓ పోలీసు అధికారిణి. ఇంతకీ ఆమె హెచ్చరిక ఎవరిని ఉద్దేశించో తెలియాలంటే ‘రక్షణ’ చూడాల్సిందే. పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 22 May 2024 00:55 IST

రోజు నేను వాడిని కలుస్తానో... అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించింది ఓ పోలీసు అధికారిణి. ఇంతకీ ఆమె హెచ్చరిక ఎవరిని ఉద్దేశించో తెలియాలంటే ‘రక్షణ’ చూడాల్సిందే. పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రమిది. రోషన్, మానస్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథలో పాయల్‌ రాజ్‌పూత్‌ ఓ శక్తిమంతమైన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. ‘వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటివాడో తెలుసు...’ అంటూ మొదలవుతోంది టీజర్‌. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక పోలీసు అధికారి జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది. నేర నేపథ్యం, మిస్టరీ అంశాలు, పాయల్‌ పాత్ర ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని తెలిపారు దర్శకనిర్మాత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు