జూన్‌లో హరోం హర

ఈ నెల 31న విడుదల కావల్సిన ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్‌ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత  మంగళవారం ప్రకటించారు.

Published : 22 May 2024 01:00 IST

నెల 31న విడుదల కావల్సిన ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్‌ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత  మంగళవారం ప్రకటించారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత. ‘‘చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. 1989 కాలంలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల్ని ప్రతిబింబిస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రం ఉంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సునీల్‌ ఇందులో ఓ కీలక పాత్రని పోషించారు. ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథన్, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని