ఆ వార్తలు నిరాధారం

‘హనుమాన్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడాయన బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Published : 26 May 2024 00:52 IST

‘హనుమాన్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడాయన బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ రద్దయినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. సృజనాత్మక విభేదాల వల్ల ఈ చిత్రం ఆగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని.. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ఇటీవలే ఫొటో, ప్రోమో షూట్‌ పూర్తయిందని వెల్లడించింది. ఈ ప్రోమో జూన్‌ ఆఖరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలపై అప్పుడే స్పష్టత రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని