మన మీదకెవడైనా వస్తే.. వాడి మీద పడిపోవడమే

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో థియేటర్లలో సందడి చేయనున్నారు విష్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణచైతన్య తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి కథానాయిక.

Updated : 26 May 2024 08:43 IST

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో థియేటర్లలో సందడి చేయనున్నారు విష్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణచైతన్య తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 31న రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘మనుషులు మూడు రకాల్రా’’ అంటూ మొదలైన ట్రైలర్‌... ‘ఆడ.. మగ... రాజకీయ నాయకులు’ అంటూ విష్వక్‌ చెప్పే సంభాషణతో ఆసక్తికరంగా ముగిసింది. ‘‘నాకు తెలిసిందొక్కటే.. మన మీదకెవడైనా వస్తే.. వాడి మీద పడిపోవడమే’’ అంటూ ట్రైలర్‌లో విష్వక్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండనుందన్నది తెలియజేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని