పోరు బాటలో నాని

‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 05 Jun 2024 01:07 IST

‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా  తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓ భారీ సెట్‌లో నానిపై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీనికి రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. దాదాపు పదిరోజులకు పైగా ఈ షెడ్యూల్‌ సాగనున్నట్లు తెలుస్తోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానుంది. దీనికి సంగీతం: జేక్స్‌ బిజోయ్, ఛాయాగ్రహణం: జి.మురళి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని