మహేశ్‌ దర్శకత్వంలో రామ్‌?

కథానాయకుడు రామ్‌ ప్రస్తుతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను ముగించే పనిలో ఉన్నారు. ఇది జులైలో థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. కానీ, దీని తర్వాత రామ్‌ చేయనున్న సినిమా ఏదన్నది ఇంత వరకు తేలలేదు.

Published : 07 Jun 2024 00:24 IST

థానాయకుడు రామ్‌ ప్రస్తుతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను ముగించే పనిలో ఉన్నారు. ఇది జులైలో థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. కానీ, దీని తర్వాత రామ్‌ చేయనున్న సినిమా ఏదన్నది ఇంత వరకు తేలలేదు. అయితే ఇప్పుడీ విషయంపై స్పష్టత వస్తోంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన యువ దర్శకుడు పి.మహేశ్‌బాబు, రామ్‌ కోసం ఓ ఎమోషనల్‌ డ్రామా కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ను రామ్‌కు వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఇది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి. సెప్టెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని