పాయల్‌ ప్రచారానికి రాకున్నా కథపై నమ్మకం ఉంది

‘‘ఓ పోలీసు అధికారి జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని అల్లుకున్న కల్పిత కథతో తెరకెక్కించిన చిత్రమే ‘రక్షణ’. ఇందులో ఓ మంచి సందేశం ఉంది’’ అన్నారు దర్శక నిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌.

Published : 07 Jun 2024 00:32 IST

‘‘ఓ పోలీసు అధికారి జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని అల్లుకున్న కల్పిత కథతో తెరకెక్కించిన చిత్రమే ‘రక్షణ’. ఇందులో ఓ మంచి సందేశం ఉంది’’ అన్నారు దర్శక నిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఈ రోజు విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు దర్శక నిర్మాత ప్రణదీప్‌. 

‘‘దొక భిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపిస్తుంది. ఆమెది బాధితుల కోసం పోరాడి.. వాళ్లను రక్షించే పాత్ర కాబట్టి ఈ సినిమాకి ‘రక్షణ’ అనే పేరు పెట్టాం. పోలీసు పాత్రకు తగ్గ ఫిజిక్‌ ఉన్న నటి కావాలనుకున్నాం. అప్పుడే ‘ఆర్‌ఎక్స్‌ 100’ వచ్చింది. అందులో పాయల్‌ పాత్ర చూసి.. తనైతే దీనికి న్యాయం చేస్తుందనుకున్నాం. తనకీ ఇది బాగా నచ్చడంతో సినిమా మొదలైంది’’. 

  • ‘‘ఈ చిత్రం కోసం పాయల్‌ 47రోజులు పని చేసింది. ఒప్పందం ప్రకారం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. తను ప్రమోషన్స్‌కు వచ్చాక మేము ఇవ్వాల్సిన రూ.6లక్షలు ఇస్తామని చెప్పాం. కానీ, ఆమె ప్రమోషన్స్‌కు రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. రూ.20లక్షలు ఇస్తే వర్చువల్‌గా సినిమాని ప్రమోట్‌ చేస్తానని ఆమె మేనేజర్‌ సౌరభ్‌ ధింగ్రా చెప్పారు. దీనిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను. ఏదేమైనా తను ప్రమోషన్స్‌కు రాకున్నా ఆమెకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఇచ్చేస్తాను. నాకు నా కథ, సినిమాపై నమ్మకం ఉంది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పూత్‌ తన పాత్రలో అద్భుతంగా నటించారు. కచ్చితంగా ఇందులో కొత్త పాయల్‌ను చూస్తారు. తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసే చిత్రమిది’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని