కన్నప్ప.. టీజర్‌ వచ్చేస్తోంది

‘కన్నప్ప’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు.

Published : 08 Jun 2024 01:09 IST

‘కన్నప్ప’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌లాల్, కాజల్‌ తదితరులు అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవలే కేన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ టీజర్‌ను ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని విష్ణు శుక్రవారం ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ పంచుకున్నారు. ‘‘ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను. జూన్‌ 14న టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశలో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని