పాండిచ్చేరిలో ముగించారు

కథానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక.

Published : 10 Jun 2024 00:56 IST

థానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక. శింబు, అభిరామి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా కమల్‌పై ఒక భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. దీనితో ఇప్పటికే 60శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మరో 40రోజుల్లో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసేందుకు చిత్ర వర్గాలు సమాయత్తమవుతున్నాయి. త్వరలోనే చెన్నైలో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో కమల్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తుండగా.. రవి.కె.చంద్రన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని