నీ నుంచి నన్ను దూరం చేయలేరు కదా..!

‘‘ఇది నిజమేనా?మనిద్దరి బంధాన్ని ఎవరూ విడదీయరా..?నన్ను నీ నుంచి దూరం చేయలేరు కదా’’ అంటూ తన ప్రియుడి ప్రేమ కోసం తపిస్తోంది బాలీవుడ్‌ కథానాయిక టబు.

Published : 12 Jun 2024 00:29 IST

‘‘ది నిజమేనా?మనిద్దరి బంధాన్ని ఎవరూ విడదీయరా..?నన్ను నీ నుంచి దూరం చేయలేరు కదా’’ అంటూ తన ప్రియుడి ప్రేమ కోసం తపిస్తోంది బాలీవుడ్‌ కథానాయిక టబు. మరి ఆమె కథేంటో తెలియాలంటే ‘ఔరో మే కహా దమ్‌ థా’ చూడాల్సిందే. టబు, అజయ్‌ దేవగణ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 13న విడుదల  కాబోతున్న ట్రైలర్‌తో ఈ సినిమా అసలైన హంగామా మొదలు కాబోతుంద’’ని   సన్నిహిత వర్గాలు తెలిపాయి. సయీ మంజ్రేకర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జులై 5న రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని