డబుల్‌ కష్టాలు.. ట్రిపుల్‌ నవ్వులు

Eenadu icon
By Cinema Desk Published : 01 Nov 2025 01:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఒకరేమో ఎంచుకున్న పాత్రలతోనే గుర్తుండిపోయే నాయిక.. మరొకరేమో నటనతో పాటు ప్రత్యేక పాటలలో స్టెప్పులు వేస్తూ కుర్రకారుని అలరించే భామ.. మరి ఇలాంటి ఇద్దరు అందాల తారలు కలిసి తెరపై సందడి చేస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధమయ్యారు కథానాయికలు మృణాల్‌ ఠాకూర్, పూజా హెగ్డే. వీరిద్దరు, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రాకకు ఇంకాస్త ఆలస్యం కానున్నట్లు తెలుపుతూ కొత్త విడుదల తేదీని ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది చిత్రబృందం. ‘‘డబుల్‌ ట్రబుల్‌.. ట్రిపుల్‌ ఫన్‌ కోసం వచ్చే ఏడాది జూన్‌ 5న సిద్ధంగా ఉండండి’’ అనే వ్యాఖ్యను జోడించింది. ముక్కోణపు ప్రేమకథగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు