Godari: ఓటీటీలో ‘గోదారి’ డాక్యుమెంటరీ.. ‘ఆహా’ అంటున్న ప్రేక్షకులు
గోదావరి అందాలను కళ్లకు కట్టేలా రూపొందిన ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కడంటే?
ఇంటర్నెట్ డెస్క్: పలు హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుకున్న ఓటీటీ ‘ఆహా’ (Aha).. శ్రీరామ నవమి సందర్భంగా మరో కానుక అందించింది. అదే ‘ఆహా గోదారి’ (Aha Godari) డాక్యుమెంటరీ. స్వాతి ముళ్ళపూడి నిర్మించిన ఆ ప్రత్యేక డాక్యుమెంటరీ మార్చి 30న స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. గోదావరి నదీ అందాలు, విశేషాలు అందరికీ తెలియాలని, ఇలాంటి డాక్యుమెంటరీల వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ‘ఆహా’ యాజమాన్యం తెలిపింది. స్వాతి మాట్లాడుతూ.. ‘‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్టత, దాని పరివాహక ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించాం’’ అని తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి స్వాతి దివాకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వీక్షించిన పలువురు ప్రేక్షకులు బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Sports News
సాకర్ బాటలో క్రికెట్!.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!