Jawan: జవాన్‌ కోసం గూగుల్‌ యానిమేషన్‌ ‘రెడీ’..!

‘జవాన్‌’ (Jawan) కోసం గూగుల్‌ సరికొత్త యానిమేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Updated : 08 Sep 2023 14:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘జవాన్‌’ (Jawan). గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో గూగుల్‌ సైతం భాగమైంది. ‘జవాన్‌’ కోసం సరికొత్త యానిమేషన్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు గూగుల్‌లో ‘JAWAN’ అని సెర్చ్‌ చేస్తే ఒక వాకీటాకీ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ‘రెడీ’ అంటూ ఈ సినిమాలో షారుక్‌ చెప్పిన డైలాగ్‌ వినిపిస్తుంది. ఇందులోని షారుక్‌ లుక్‌ను గుర్తు చేసేలా.. బ్రౌజర్‌ పేజీ మొత్తం బ్యాండెజ్‌లతో నిండిపోతుంది. గూగుల్‌ క్రియేట్‌ చేసిన ఈ యానిమేషన్‌ సోషల్‌మీడియా యూజర్లకు బాగా నచ్చేసింది.

రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘జవాన్‌’ చిత్రం సిద్ధమైంది. అట్లీ దర్శకత్వం వహించారు. షారుక్‌ ఇందులో విక్రమ్‌ రాథోడ్‌, ఆజాద్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించారు. గుండుతో, ముఖానికి బ్యాండెజ్‌లు కట్టుకుని, జవాన్‌గా, యంగ్‌ స్టైలిష్‌ లుక్‌.. ఇలా దాదాపు ఏడు గెటెప్స్‌లో షారుక్‌ అలరించారు. నయనతార కథానాయిక. దీపికా పదుకొణె అతిథి పాత్రలో సందడి చేశారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. షారుక్‌ నుంచి ఇలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ను చూడటం ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. మరోవైపు మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ.120 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక, ఒక సినిమా కోసం గూగుల్‌ యానిమేషన్స్‌ క్రియేట్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ విజయం అందుకున్న సమయంలో స్పెషల్‌ యానిమేషన్‌తో గూగుల్‌ ఆకట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని  సెర్చ్‌ చేస్తే గుర్రం, బైక్‌ ఎమోజీలు సైడ్‌కి స్క్రోల్‌ అవుతూ కనిపిస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని