Gopichand: నిరంతర రణం.. తదైవ విశ్వం

కథానాయకుడు గోపీచంద్‌.. దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది.

Updated : 12 Apr 2024 12:33 IST

థానాయకుడు గోపీచంద్‌.. దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘విశ్వం’ అనే పేరును ఖరారు చేశారు. రంజాన్‌ సందర్భంగా గురువారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ స్ట్రైక్‌ పేరుతో ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఘనంగా ఓ వివాహ వేడుక జరుగుతుండగా గోపీచంద్‌ ఓ పెద్ద గిటార్‌ బ్యాగ్‌ భుజానికి తగిలించుకొని అక్కడికి రావడం.. ఆ బ్యాగ్‌లో నుంచి ఓ పెద్ద మెషిన్‌ గన్‌ బయటకు తీసి ఆ వేడుకలో ఉన్న వధూవరులతో పాటు అతిథులందర్నీ కాల్చి చంపడం ఆసక్తిరేకెత్తించింది. ఆఖర్లో ఆ పెళ్లి వేడుకలో సిద్ధం చేసిన బిర్యానీని రుచి చూస్తూ.. ‘‘ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. దీనిపై నా పేరు రాసుకున్నాను’’ అంటూ గోపీచంద్‌ చెప్పిన డైలాగ్‌ ఆ గ్లింప్స్‌కు ఆకర్షణగా నిలిచింది. ‘‘తెగి పడటం.. తెగించగలడం.. ప్రమాణ ఫలితం.. విఘాత విశ్వం.. నిలబడటం.. నియంతలగుటం.. నిరంతర రణం.. తదైవ విశ్వం’’ అంటూ బ్యాగ్రౌండ్‌లో వినిపించిన నేపథ్య సంగీతం కూడా ఆలోచింపజేసేలా ఉంది. మొత్తంగా ఈ ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇందులో గోపీచంద్‌ మునుపెన్నడూ చేయని విభిన్న పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు