Ram Charan: రామ్‌చరణ్‌ మూవీలో తమిళ స్టార్‌ హీరో..?

‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ (Ram Charan) బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక అప్‌డేట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

Updated : 08 Jul 2023 20:09 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చేస్తోన్న ఆయన త్వరలో సానా (Buchi Babu Sana) డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామాగా సిద్ధం కానున్న ఈ సినిమా ‘ఆర్‌సీ16’ (RC16)గా ప్రచారంలో ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక విషయాలు ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్‌ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆయనది ప్రతినాయకుడి పాత్ర కాదని సమాచారం. ఇందులో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని, సినిమా మొదలైన నాటి నుంచి చివరి వరకూ ఈ పాత్ర కనిపించనుందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక, ‘ఉప్పెన’తో విజయ్‌ సేతుపతి తెలుగువారికి సుపరిచితులయ్యారు. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’లో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని