Mithun Chakraborty: ప్రధాని ఫోన్‌ చేసి మందలించారు: మిథున్‌ చక్రవర్తి

Mithun Chakraborty: బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ చేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated : 12 Feb 2024 20:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్రమోదీ తనని మందలించారని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) అన్నారు. ఫిబ్రవరి 10న  మిథున్‌కు తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో అతని కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎంఆర్‌ఐతో సహా వివిధ పరీక్షలు చేసి, ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం మిథున్‌ చక్రవర్తి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈసందర్భంగా మిథున్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సమస్యా లేదని వైద్యులు చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉన్నా. నా ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాల్సి ఉంది. త్వరలోనే పనిచేయడం మొదలుపెడతా. బహుశా అది రేపటినుంచే కావచ్చు’’ అని అన్నారు.

మిథున్‌ చక్రవర్తి అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఫోన్‌ చేశారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలంటూ తనని సున్నితంగా మందలించారన్నారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని మోదీతో అన్నట్లు చెప్పారు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత అయిన మిథున్‌ హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో 350కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో లీలాధర్‌ స్వామిజీ పాత్రలో నటించి మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని