Guntur karam: అమెరికాలో ‘గుంటూరు కారం’ హవా.. కుర్చీని మడతబెడుతోన్న ఫ్యాన్స్‌..

‘గుంటూరు కారం’లోని ‘కుర్చీని మడతపెట్టి’ పాటకు అమెరికన్స్‌ డ్యాన్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేశారు.

Published : 02 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు (Mahesh Babu) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ లక్షల వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి నేటివరకు రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటను అమెరికాలోని ఓ వేదికపై ప్రదర్శించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మాస్‌ పాటకు చిందేసి ఎంజాయ్‌ చేశారు.

ప్రస్తుతం అమెరికాలో నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ గేమ్స్‌ జరుగుతున్నాయి. ఈ గేమ్స్‌ మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. ఈ వీడియోను ‘గుంటూరు కారం’ టీమ్ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. ‘మన పాట హవా ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌ కూడా ఈ వీడియోను షేర్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని