Gautham Menon: ఎటైనా వెళ్లిపోవాలని ఉంది.. ‘ధృవ నక్షత్రం’ వాయిదాపై గౌతమ్‌ మేనన్ స్పందన

‘ధృవ నక్షత్రం’ విడుదల వాయిదా పడటంపై దర్శకుడు గౌతమ్‌ మేనన్ అసహనం వ్యక్తం చేశారు.

Published : 28 Feb 2024 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గౌతమ్‌ మేనన్ దర్శకత్వంలో విక్రమ్‌ (Vikram) హీరోగా నిర్మించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు స్పందించారు. ఈ సినిమా వాయిదా పడడం  బాధ కలిగిస్తుందన్నారు.

‘ఇది చాలా హృదయవిదారకంగా ఉంది. చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నా. మార్చి1న  ‘జాషువా’ విడుదల కానుంది. ముందే ‘ధృవ నక్షత్రం’ విడుదల చేయాలని భావించాం. అది కుదరలేదు’ అని అసహనం వ్యక్తం చేశారు.

మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

2016లోనే ‘ధృవ నక్షత్రం’ పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఆర్థిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయింది.  గతేడాది నవంబర్‌లో విడుదలచేయాలని భావించగా తిరిగి వాయిదా పడింది. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి చెల్లించేవరకూ ‘ధృవ నక్షత్రం’ విడుదలను ఆపివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని