Hema: వైరల్‌ ఫీవర్‌ వచ్చింది.. పోలీసు విచారణకు హాజరుకాలేను: సినీ నటి హేమ

Hema Rave Party: బెంగళూరు రేవ్‌ విచారణకు హాజరుకాలేనని సినీ నటి హేమ పోలీసులకు లేఖ రాశారు.

Published : 27 May 2024 15:26 IST

హైదరాబాద్‌: తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని సినీ నటి హేమ (Hema) బెంగళూరు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మనమేమీ దేవుళ్లం కాదు!

మరోవైపు నటి హేమ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ‘‘మనం తప్పు చేయనంతవరకూ ఎదుటివాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుళ్లం కాదు కదా! పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం ఫ్రెష్‌గా ఉంటాం. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్దాలు ఆడాలి. 99శాతం అబద్ధాలు ఆడకుండా ఉండటం మంచిది. అందుకే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను. ప్రస్తుతం నాకు ఎలాంటి షూటింగ్‌లు లేవు. మరీ అత్యవసరమైతేనే వెళ్తున్నాను. మరో మూడు నెలలు ఖాళీగా ఉంటా’ అని హేమ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని